హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు వామపక్ష కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పాటు విద్యుత్ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, వీబీ జీఆర్ఏఎంజీ చట్టం- 2025ల రద్దు, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం, సీమ్ వరర్లు సహా కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయడం, ఇతర డిమాండ్లపై గురువారం జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మె నిరసన ప్రదర్శనలో ట్రేడ్ యూనియన్ కార్మికులతో కలిసి పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రైతులను విజ్ఞప్తి చేసింది.
సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టీ సాగర్, పశ్యపద్మ, వీ ప్రభాకర్, మండల వెంకన్న, పెద్దారపు రమేశ్, జకుల వెంకటయ్య, ఆర్ వెంకట్ రాములు, కాంతయ్య, నాగిరెడ్డి, విజయ్, కొండల్ పాల్గొన్నారు.