హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): తాము కోరిన సీట్లు ఇస్తేనే పొత్తు కొనసాగుతుందని లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ను హెచ్చరిస్తున్నాయి. తమకు ఐదేసి సీట్లు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం ప్రతిపాదించగా.. రెండేసి చొప్పున ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకున్నట్టు సమాచారం.
అయితే ఆ రెండు తాము కోరుకున్న సీట్లనే ఇవ్వాలని కమ్యూనిస్టులు పట్టుబడుతుండగా.. ఒకటి కోరుకున్న సీటు, మరొకటి వేరొక చోట ఇస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. 48 గంటల్లో ఏదో ఒకటి తేల్చాలని లెఫ్ట్ నేతలు కాంగ్రెస్కు గడువు విధించారు. కాంగ్రెస్తో పొత్తు కుదరకపోతే తామైనా కలిసి పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి.