Fake Certificates | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యలో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు అధ్యాపకులు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందగా, ఇప్పుడవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 9 మం ది దొరకగా, వారిని ఉద్యోగాల నుంచి డి స్మిస్ చేశారు. వీరేకాకుండా మరో వంద మంది ఫేక్రాయుళ్లు ఉన్నట్టుగా తేలింది. ఇది వరకు డిగ్రీ, పీజీ నకిలీ సర్టిఫికెట్లు దొ రకగా, ఓ మహిళా లెక్చరర్ పదో తరగతి నకిలీ మెమోను సమర్పించి అడ్డంగా బు క్కయ్యారు. ఇంటర్ విద్యలో 2,904 జేఎ ల్, 184 మంది వొకేషనల్ లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వీరంతా 2000 సంవత్సరం తర్వాత నియమితులైన వారే. 20 ఏండ్ల తర్వాత వీరంతా రె గ్యులరైజ్ అయ్యారు.
అప్పట్లో సర్టిఫికెట్ల పరిశీలన జరపగా… కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు బయటపడడంతో పక్కనపెట్టారు. అయి నా కొన్నింటిని గుర్తించలేకపోయారు. తా జాగా రెగ్యులరైజ్ అయిన ఏడాదిన్నర త ర్వాత వంద మంది లెక్చరర్ల సర్టిఫికెట్లపై ఫిర్యాదులొచ్చాయి. వీటిలో కాకతీయ వర్సిటీ పేరుతో జారీ అయిన సర్టిఫికెట్లే ఎ క్కువగా ఉన్నాయి. మరికొన్ని ఓయూకి చెందినవి ఉన్నాయి. సంబంధిత సర్టిఫికె ట్లు అసలువో.. నకిలీవో తేల్చేందుకు యూనివర్సిటీలకు పంపించారు. అయితే ఈ సర్టిఫికెట్లపై కాకతీయతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ సైతం తీవ్ర జాప్యం చేస్తున్నది. వర్సిటీలు వేగంగా స్పందించడంలేదని ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులంటున్నారు. నకిలీవని తేలితే సంబంధిత లెక్చరర్లపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.