బతుకమ్మ కంటే యూరియానే ముఖ్యమని వరంగల్ జిల్లా ఖానాపురం మండల మహిళలు నిరూపించారు. యూరియా ఇస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వేడుకలను మధ్యలోనే ముగించుకొని బతుకమ్మలు తీసుకొచ్చిన ప్లేట్లతో మనుబోతులగడ్డ గ్రామపంచాయతీ కార్యాలయానికి పరుగులుపెట్టారు.
గమనించిన చుట్టుపక్కల రైతులు వందలాది మంది తరలివచ్చి టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నారు.