వలిగొండ, జూలై 28 : కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి నాయకులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన వలిగొండ సర్పంచ్ బొల్ల లలితాశ్రీనివాస్, ఆరూరు ఎంపీటీసీ పసల జ్యోతీదయానంద్, వలిగొండ ఎంపీటీసీ-2 కుందారపు యశోదాకొమురయ్య, వెలువర్తి ఎంపీటీసీ ఎడవెల్లి సత్తమ్మయాదయ్య, చిత్తాపురం ఎంపీటీసీ నీలం లలితాబాబూరావుతోపాటు మరో 250 మంది వరకు కార్యకర్తలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్లో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు. కొత్తగా చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.