ఎల్బీనగర్, మార్చి 11 ః ఫ్లాట్ యజమాని పేరు మార్చేందుకు లింగోజిగూడకు చెందిన శ్రీధర్ నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఎల్బీనగర్ సర్కిల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.