వరంగల్ లీగల్, ఏప్రిల్ 25 : రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన న్యాయవాదులు పార్టీ రజతోత్సవ సంరంభంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సోమ భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ పార్టీ ఆఫీసులో వరంగల్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. న్యాయవాదులు మౌనంగా ఉంటే అది ఉగ్రవాదానికి మించిన నేరమవుతుందని చెప్పారు.
మహబూబాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సభపై రాష్ట్ర ప్రభుత్వం రోజుకో కుట్రకు తెరలేపుతున్నది. తాజాగా మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారి ప్రైవేటు పాఠశాలల బస్సులను ఇతరత్రా వినియోగించొద్దని ఉత్తర్వులు జారీచేశారు. అలా వినియోగిస్తే అపరాధ రుసుముతో పాటు బ స్సులను సీజ్ చేస్తామని, సీటుకు రూ.3285 పన్ను వ సూలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా సభను అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.