హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న అట్టహాసంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు న్యాయవాదులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేత, అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి ఉపేంద్ర పిలుపునిచ్చారు. ఉద్యమపార్టీగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ రాజకీయ, అధికారపార్టీగా తనదైన ముద్రవేసుకున్నదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక పోరాటంలో కేసీఆర్కు అండగా ఉన్న న్యాయవాదులు, అధికారం చేపట్టిన తర్వాత కూడా అదే పంథాలో ముందుకుసాగారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చారిత్రాత్మకమైన రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.