హైకోర్టు శంకుస్థాపనలో న్యాయవాదులకు అవమానం.. హైకోర్టుకు అడ్వకేట్స్ అసోసియేషన్ నిరసన.. రిజిస్ట్రార్‌కు లేఖ
తెలంగాణ హైకోర్టు జోన్-II భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయవాదులకు కల్పించిన సీటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాసి నిరసన వ్యక్తంచేసింది. రాజేంద్రనగర్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బార్ సభ్యులకు తగిన గౌరవం లభించలేదని, అది తమకు నిరాశ కలిగించిందని అసోసియేషన్ పేరొంది.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టు జోన్-II భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయవాదులకు కల్పించిన సీటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాసి నిరసన వ్యక్తంచేసింది. రాజేంద్రనగర్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బార్ సభ్యులకు తగిన గౌరవం లభించలేదని, అది తమకు నిరాశ కలిగించిందని అసోసియేషన్ పేరొంది. అసోసియేషన్ కమిటీ సభ్యులను బారికేడ్ల వెనుక కూర్చోబెట్టడం వారి హోదాకు అవమానకరమని అభిప్రాయపడింది. న్యాయవాదుల ప్రతినిధులుగా ఎన్నికైన కమిటీ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వకపోవడం ద్వారా సంస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని పేరొంది. ఇది ప్రత్యేక హకుల కోసం కాదని, కానీ సంస్థ ప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలనే అంశమని స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులకు కూడా వారి స్థాయికి తగ్గ సీటింగ్ కల్పించలేదని తెలిపింది.
సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కొంతమంది సీనియర్ న్యాయవాదులు కార్యక్రమం పూర్తికాకముందే వెళ్లిపోయారని పేర్కొంది. ఈ ఘటన రిజిస్ట్రీ నుంచి ఆశించే వృత్తిపరమైన మర్యాద లోపాన్ని ప్రతిబింబిస్తున్నదని పేరొంది. ఈ పరిణామాలు న్యాయవాదుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయని, బార్ గౌరవానికి భంగం కలిగించిన చర్యగా భావిస్తున్నామని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితమైన ప్రొటోకాల్ విధానాన్ని అమలుచేయాలని, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి తగిన గుర్తింపు ఇవ్వాలని, సీనియర్ కౌన్సిల్స్‌ను గౌరవప్రదంగా చూసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

