హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర మండిపడ్డారు. ఇటీవల నాంపల్లి, కూకట్పల్లి, మంచాలలో అడ్వకేట్లపై జరిగిన దాడులను ఉదహరించారు. న్యాయవాదులపై దాడిని ఖండిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదలచేశారు. కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని లెకచేయకుండా సమాజం కోసం పనిచేస్తున్న న్యాయవాదులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటుచేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకోసం న్యాయవాదులంతా సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఏడాదిలోనే 20 వేల కోట్ల లావాదేవీలు ; ‘క్యాప్స్ గోల్డ్’లో అంతులేని అక్రమాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమ స్తే తెలంగాణ): పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారం మేరకు గత 5 రోజులుగా హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, ముంబై, బెంగళూరులోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇం డ్లలో సోదాలు నిర్వహిస్తున్న ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు ‘క్యాప్స్ గో ల్డ్’ సంస్థలో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. కేవలం ఒక్క ఏడాదిలోనే ఆ సంస్థ రూ.20 వేల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు నిర్వహించినట్టు తేల్చారు. దేశంలోని టాప్-3 బులియన్ మర్చెంట్లలో ఒకటిగా పేరుగాంచిన ఈ సంస్థ భారీగా ప న్ను ఎగవేతలకు పాల్పడటంతోపాటు బ్లాక్ మారె ట్ నుంచి బంగారం కొనుగోలు చేసి అన్అకౌంటెడ్ సేల్స్ చేయడం, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి భారీగా బంగారాన్ని కొనుగోలుచేసి దారిమళ్లించడం లాంటి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఆ క్రమం లో పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు.