హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు రెండో రోజైన గురువారం 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,080 మంది నామినేషన్లను దాఖలు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
సాయంత్రం ఐదు గంటల్లోగా ఆర్వో కా ర్యాలయ ప్రాంగణంలోకి చేరినవారికి నా మినేషన్లు వేసే అవకాశం కల్పించినట్టు తెలిపింది. తొలిరోజు 890మంది 902 నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల సమర్పణకు నేడు(శుక్రవారం) గడువు ముగియనున్నందున భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉన్నది.