శంషాబాద్ రూరల్, జూన్ 29: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి లేజర్ లైట్లు కలకలం రేపాయి. జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుంచి లుఫ్తాన్సా వి మానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చే రుకొని ల్యాండింగ్‌కు సిద్ధమైంది. అదే సమయంలో లేజర్ లైట్లు పైలట్‌కు ఇ బ్బందిగా మారాయి.
పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ల్యాండిం గ్ చేశారు. అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు అధికారులు లేజర్ లైట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో విచారణ చేస్తున్నారు.