హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సం చారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నా రు. కొడిమ్యాల మండలం కొండాపూర్‌కు చెందిన గుండుబాబు అనే రైతు పొలం వద్ద కట్టేసిన ఆవును రాత్రిపూట పెద్దపులి చంపి తిన్నది. ఉదయం పొ లం వద్దకు వెళ్లి చూసిన గుండుబాబు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భోళ్ళెంచెరువు, సురేంపేట్, దమ్మయ్యపేట, రామకిష్టాపూర్, గోవిందరం గ్రా మాల పరిధిలో పులి సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలు, ఆనవాళ్లు తెలిస్తే సమాచారం అందించాలని సూచించారు.