ఇసుక మాఫియాతో ప్రాణ హాని
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులోని దుందుభీ వాగు పరీవాహక ప్రాంతంలో నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు యత్నిస్తున్నారు.
- పోలీసులను ఆశ్రయించిన భూయజమానులు
మిడ్జిల్, జూలై 8 : మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులోని దుందుభీ వాగు పరీవాహక ప్రాంతంలో నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు యత్నిస్తున్నారు. ఇదే విషయమై భూ యజమాని బాలకృష్ణారెడ్డితోపాటు మరో రైతు బుధవారం మిడ్జిల్ పోలీసులను ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కోరారు.
కొత్తపల్లి శివారులోని సర్వే నంబర్లు 87, 89, 91, 96, 98, 99లో సుమారు 110 ఎకరాల భూమిలో ఇసుక నిల్వలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ అనుమతులతో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అవసరాలకు ఇసుక తరలించే వారని తెలిపారు. ఆ అనుమతులు 2025 నవంబర్ 29 తేదీ నాటికి ముగిసాయని, మిగిలిన ఇసుక నిల్వలు తమ భూమిలోనే నిల్వ ఉంచినట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో పలువురు ట్రాక్టర్లతో వాగు ప్రాంతానికి చేరుకొని నిల్వ ఇసుకను తరలించేందుకు యత్నించారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- landowners
- Police
- Sand mafia
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

