మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ ( Minister Vivek ) ను, అధికారులను భూ నిర్వాసితులు నిలదీశారు. నూతన ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భూనిర్వాసితులు మాట్లాడుతూ ఏటీసీ( ATC ) భవన నిర్మిస్తున్న ప్రాంత భూములు తమవని తమకు కనీస సమాచారం లేకుండా భూములను ప్రభుత్వం లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక దశలో కలెక్టర్ భూనిర్వాసితులపై మండిపడ్డారు, ఈ భూములన్ని ప్రభుత్వ భూములని, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఎవరికి డబ్బులు ఇచ్చారు. వాళ్లని అడగాలని మండిపడ్డారు.
అదేవిధంగా చెన్నూరు పట్టణంలో చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వచ్చిన మంత్రికి మహిళలు నిలదీశారు. తమకు సంక్షేమ పథకాలు రావడం లేదంటూ మండిపడ్డారు. పట్టణంలో సరైన రోడ్లు, నాళాలు త్రాగునీటి వసతులు లేవని వివరించారు.