హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, ఆ హక్కులకు చెందిన పత్రాల ప్రామాణికత, హక్కులు ఎవరివో సివిల్ కోర్టులు మాత్రమే తేల్చుతాయని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. భూములపై యాజమాన్య హక్కులు, భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది, యజమాని, వారసులు ఎవరో వంటి అంశాలను సివిల్సూట్ ద్వారా సివిల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టంచేశారు.
హైదరాబాద్‌లోని షేక్‌పేట గ్రామం బంజారాహిల్స్‌లోని సర్వే నంబర్ 396లో 7 ఎకరాలకు తాము దైవాన్ మహారాజా కిషన్ పెర్షద్ వారసులమని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. భూ యజమానుల పూర్వీకులతో రియల్ఎస్టేట్ సంస్థ ప్రిస్టేజ్ ఎస్టేట్స్ చేసుకున్న పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన హైకోర్టు.. భూయాజమాన్య హకుల వ్యవహారంతో ముడిపడిన వీటిని సివిల్కోర్టులోనే తేల్చుకోవాలని తీర్పు చెప్పింది.