LRS | హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.10వేల కోట్లు వసూలు చేయాలని ఉన్నతాధికారులు మున్సిపాలిటీతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు టార్గెట్ విధించారు. కానీ, ఇప్పటి వరకు కేవలం రూ.150కోట్లు మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజులు స్వీకరించినట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే మూడున్నర నెలల్లో రూ.10వేల కోట్ల నిధుల సమీకరణ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది కులగణన, ఆస్తి పన్ను వసూలు వంటి వాటితోనే బిజీగా ఉండగా, కొత్తగా గృహసర్వే కూడా తెరపైకి తీసుకొచ్చారు. దీంతో నిర్ణీత వ్యవధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ కష్టతరమని పలువురు పేర్కొంటున్నారు.