మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 00:06:58

సంబురపడ్డ బిడ్డలు

 సంబురపడ్డ బిడ్డలు

  • నిర్మల్‌లో అరగంటలోనే పిల్లల పేరిట భూరిజిస్ట్రేషన్‌

సోన్‌: నా పేరు కొల్ల భూమయ్య. మాది నిర్మల్‌ మండలంలోని ఎల్లారెడ్డిపేట. నా సొంత భూమి పక్కనే సర్వేనంబర్‌ 116లోని 4 ఎకరాల 17 గుంటల భూమిని ఏడాది కిందట కొన్నా. ఆ భూమిని ఆనుకొని ఉన్న మరో 3.5 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేశా. రిజిస్ట్రేషన్‌ చేయాలనుకున్నప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ధరణి వచ్చిందని మా బిడ్డా, కొడుకు చెప్పారు. శుక్రవారం మీసేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేశాను. పత్రాలు తీసుకొని శనివారం మధ్యాహ్నం తాసిల్‌ కార్యాలయానికి వెళ్లాం. కొడుకు అనిల్‌ పేరిట రెండెకరాల 17 గుంటలు, కూతురు అఖిల పేరిట రెండెకరాల భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని చెప్పా. తాసిల్దార్‌ పత్రాలు సరి చూసుకున్నాడు. సాక్షుల సంతకాలు తీసుకొని పంపించారు. అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని చెప్పి పత్రాలు ఇచ్చారు. ఇంత త్వరగా అయినందుకు సంతోషంగా ఉన్నది. నా పిల్లలు కూడా సంబురపడ్డారు. సీఎం కేసీఆర్‌ సార్‌కు సలాం.