Yadagirigutta | యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (yadagirigutta lakshmi narasimha swamy) వారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు పొన్న వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు. పొన్న వృక్షమంటే కల్పవృక్షమని (kalpavruksham) అర్థం. కల్పవృక్షంపై నుంచి స్వామివారిని దర్శించుకొని భక్తులు తరించారు. సకల కోరికలను తీర్చు కల్పవృక్షం శక్తి సామర్థ్యాలను భగవానుడు అనుగ్రహించడం పొన్నవాహనసేవలో అనుగ్రహించడం ఎంతో ప్రీతికరమైందని, ఆలయ అర్చకులు తెలిపారు.
అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఇదిలా ఉండగా.. ఉత్సవాల్లో ఐదో రోజైన శనివారం స్వామివారు ఉదయం స్వామివారు మురళీమోహనుడిగా దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం జగన్మోహుడి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు, 28న తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవం, శ్రీమహావిష్ణువు అవతారంలో గరుడవాహన సేవ, రాత్రికి ప్రధానాలయం తిరువీధుల్లో రథోత్సవం, 2న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రికి శ్రీపుష్పయాగం, దోపోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.