జడ్చర్ల టౌన్/మహబూబ్‌నగర్, జూన్ 14 : మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని అవార్డు వరించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. అత్యధిక స్థాయిలో రక్తదాతలకు ప్రేరణగా నిలిచిన ఆయనకు ఇండివిజివల్ హైయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా లక్ష్మారెడ్డి తరపున అవార్డును జడ్చర్ల బీఆర్ఎస్ నాయకులు కోడ్గల్ యాదయ్య, ప్రణీల్‌చందర్, నాగిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి అందుకున్నారు. 24 ఏండ్లుగా లక్ష్మారెడ్డి తన బర్త్‌డేను పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుండటం.. దీంతో పెద్ద సంఖ్యలో దాతలు ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యధిక స్థాయిలో రక్తదాతలకు ప్రేరణగా నిలిచిన ఆయనకు గుర్తింపు లభించింది. అవార్డు రావడంపై స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. అవార్డుగ్రహీత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రక్తదానంపై అపోహలు వీడి అందరూ రక్తదానం చేయాలని, అది ప్రాణదానంతో సమానమని సూచించారు.
పాలమూరు బ్లడ్‌బ్యాంక్‌కు అవార్డు
మహబూబ్‌నగర్‌లోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉత్తమ సేవలకుగాను గుర్తింపు లభించింది. బెస్ట్ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్‌తోపాటు సమన్వయకర్త అశ్వినీ చంద్రశేఖర్, రక్తదాత శ్రీకాంత్ యాదవ్ అందుకున్నారు. రాష్ట్రంలో 2024-25లో అత్యధిక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 7,589 యూనిట్ల రక్తాన్ని సేకరించగా.. మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్‌కు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లభించింది. కాగా 160 సార్లకుపైగా రక్తదానం చేసిన నటరాజ్‌ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.