హైదరాబాద్, జూన్ 15 (నమ స్తే తెలంగాణ): రాష్ట్రంలో స్వ యం సహాయక సంఘాలకు ఐదేండ్లలో లక్ష కోట్ల రుణాలను అందించనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.56 లక్షల సం ఘాలకు రూ.20 వేల కోట్ల రుణాలను అందిస్తామని చెప్పారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో 2024-25 ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు ఇచ్చే రుణ ప్రణాళికను మంత్రి సీతక్క, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో అనితా రామచంద్రన్ విడుదల చేశా రు. మహిళలకు వడ్డీలేని రుణాలు ప్ర భుత్వం ఇస్తుందని సీతక్క తెలిపారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.2 లక్షల వ రకు సభ్యులు మరణిస్తే వారి రుణాన్ని చెల్లించే విధంగా బీమాను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించామని, దీని ద్వారా మహిళలకు రూ. 50కోట్లు అదనపు ఆదాయం సమకూరిందని చెప్పారు.