హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కార్మిక పోరాటాలతో తెచ్చుకొన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఆ రోజును బ్లాక్‌డేగా పాటించాలని తెలంగాణ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘం పిలుపు ఇచ్చింది. ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ని పాటించాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర అసోసియేషన్లు పిలుపు ఇచ్చినట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ తెలిపింది.
ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఆ పిలుపును అమలు చేద్దామని యూనియన్లకు లేఖలు రాసినట్టు తెలిపింది.