కవాడిగూడ, నవంబర్ 26 : కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్కోడ్ల నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాయింట్ ప్లాట్‌ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపులో భాగంగా బుధవారం ఇందిరాపార్కు వద్ద పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన గర్జన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఐఎన్టీయూసీ నేత జనక్‌ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబా, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కే సూర్యం, హెచ్ఎంఎస్ రాష్ట్ర నేత అమ్జద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఏఐఏడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్ర ధాన కార్యదర్శి సాగర్లు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునే వరకూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలో పలు సంఘాల నాయకులు జే వెంకటేశ్, ఉమానాగేంద్రమణి, ఆదిల్ షరీఫ్, యూసుఫ్, కుమారస్వామి, రాజేందర్, మారన్న, రహమాన్, వెంకటయ్య, ప్రతాప్‌రెడ్డి, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.