యాదాద్రి భువనగిరి : భువనగిరి(Bhuvanagiri) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా క్యామ మల్లేష్(Kyama Mallesh) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జండగేకు అందజేశారు. ఆయన వెంట మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.