హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ ఎన్నికైనట్టు సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం అన్ని జిల్లా అధ్యక్షులు, సంఘం ముఖ్య నేతల సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా క్యామ మల్లేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.
సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఎన్నుకున్నట్టు చెప్పారు. అతిత్వరలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి.. సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు.