Congress | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చి న కురియన్ కమిటీ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. మూడు రోజుల పర్యటనను రెం డు రోజులకే కుదించుకొని శుక్రవారం తిరిగి వెళ్లిపోయింది. కమిటీకి నేతృత్వం వహించిన పీజే కురియన్ శుక్రవారం ఉదయం కేరళకు వెళ్లిపోగా, మిగతా ఇద్దరు సభ్యులు సాయం త్రం నాలుగు గంటల వరకు పార్లమెంట్ ని యోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, డీసీసీ అ ధ్యక్షుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నా రు. కమిటీ ముందు హాజరైన ఓడిపోయిన ఎం పీ అభ్యర్థులు, గెలిచిన ఎంపీలు ఒకేలా రాసిచ్చిన స్క్రిప్ట్ మాదిరిగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడం వల్లనే ఓడిపోయామని చెప్ప డం పట్ల కురియన్ పెదవి విరిచిన విషయం తెలిసిందే.
‘ఇలా అయితే వాస్తవాలెలా బయటికి వస్తాయి. మమ్మల్ని కలువడానికి ముందు మీరంతా ఒకే విధంగా చెప్పాలని నిర్ణయించుకున్నారా? అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెండో రోజు కూడా అవే కా రణాలనే చెప్పినట్టు తెలిసింది. దీంతో ఇక ఫ లితం లేదని భావించిన మిగతా ఇద్దరు సభ్యు లు కూడా శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి తి రిగి వెళ్లిపోయారు. తమ నివేదికను ఈ నెల 21న అధిష్ఠానానికి అందించనున్నట్టు కురియన్ కమిటీ సభ్యుడు రికాబుల్ హసన్ మీడియాకు తెలిపారు. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే ఫోన్ చేసి కానీ, రాతపూర్వకంగా గానీ పంపవచ్చని వారు సూచించినట్టు తెలిసింది. వివరాలను గో ప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
అప్పుడు అలా చెప్పారు!
అధికారంలో ఉండి కూడా మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోకపోవడానికి అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగలేదని, ఇతర పార్టీలకు చెందిన నేతలను ఎన్నికలకు ముందే పార్టీలో చేర్చుకొని బరిలోకి దించారని, నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచే విధంగా బలహీనమైన అభ్యర్థులను ఎంపిక చేశారని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి ఉప్పు అందించారు. ఇందులో నిజానిజాలను తేల్చేందుకే ఏఐసీసీ కురియన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి రాష్ర్టానికి పంపింది. కానీ కమిటీ ముందు హాజరైన వారంతా పై కారణాల్లో ఒక్కటీ చెప్పలేదు. దీంతో వారు రాష్ట్ర నాయకత్వానికి భయపడ్డారా? లేక తమ నాయకుడిని కాపాడుకున్నారా అన్న సందేహా లు వ్యక్తమవుతున్నాయి.
పదవులు లేకపోవడమే కారణం: మల్రెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలువకపోవడానికి మంత్రివర్గంలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడమే కారణమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కమిటీకి వివరించినట్టు మీడియాకు తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇక్కడ ఎంపీ సీట్లు గెలువలేకపోయామని ఆయన వివరించారు.
ఒప్పందమే కొంపముంచింది : ఫిరోజ్‌ఖాన్
పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎంతో కాం గ్రెస్ పార్టీ లోపాయకారి పొత్తు పెట్టుకోవడం తో హిందూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారని నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి న ఫిరోజ్‌ఖాన్.. భిన్నమైన వాదన వినిపించినట్టు తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ సీట్లలో కాం గ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఇదే కారణమని ఆ యన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచన మేరకు హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించిందని, తనకు అక్కడి నుంచి టికెట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా గెలిచేవాడినని కూడా ఫిరోజ్‌ఖాన్ చెప్పినట్టు తెలిసింది.’
దానంపై అనర్హతకు మరో పిటిషన్
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నిర్మల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే ఏ మహేశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు విచారణలో ఉన్నాయి. తాజా పిటిషన్‌పై కూడా హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.