గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి.. వచ్చే నెల 6న ఇందిరాపార్క్ వద్ద ధర్నా.. కూనంనేని
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములు, భూదాన భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములు, భూదాన భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల కూల్చివేతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బుధవారం కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని విలేకరులతో మాట్లాడుతూ జూలై 6న ఇందిరాపారు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. పాశ మైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 54 మంది మరణించి ఏడాది పూర్తవుతున్నప్పటికీ బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం అందకపోవడం దారుణమని కూనంనేని పేర్కొన్నారు. కోటి రూపాయల పరిహారం యాజమాన్యం నుంచి చెల్లించేలా చూస్తామని నాడు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

