కామేపల్లి, ఏప్రిల్, 15: దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకబడ్డారని, ప్రభుత్వరంగ ఆస్తుల అమ్మకంలో మాత్రం ముందంజలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. సీపీఐ ఆధ్వర్వంలో చేపట్టిన ప్రజాపోరు యాత్ర శనివారం రాత్రి ఖమ్మం జిల్లా కామేపల్లి, కారేపల్లి మండలాల్లో సాగింది.
ఈ సందర్భంగా సీపీఐ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ మోదీ పాలనలో ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. సంపన్నులతో కలిసి మోదీ నిరుపేదల పొట్టకొడుతున్నారని విమర్శించారు.