భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 7 : రాజకీయాల్లో చివరి వరకు సీఎం కేసీఆర్ వెంటే ఉంటానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు.
బీఆర్ఎస్లో తన ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు లేనిపోని అభాండాలు వేస్తూ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకొని తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో, సమాజంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తి లేదని, కార్యకర్తలు గందరగోళానికి గురికావద్దని సూచించారు.