భువనగిరి అర్బన్: రాష్ట్రంలోని కులవృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువులో చేపలు వదలడంతో పాటు హైదరాబాద్ చౌరస్తా సమీపంలో రూ.2కోట్లతో జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్‌తో కలిసి బుధవారం భూమి పూజ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ వ్యవ స్థను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి తరహాలోనే చేపల ఉత్పత్తులు పెం చడానికి ఉచిత చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నామన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూ, వృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణం అంటే అన్ని వర్గాల ప్రజల ఆదాయం పెరిగి దారిద్య్ర రేఖ నుంచి బయటకు వచ్చినప్పుడే బంగారు తెలంగాణ నిర్వచన మని సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ, చాకలి, మంగళి వారికి ఉచిత విద్యుత్, గౌడ కులస్థులకు తాటి చెట్ల పన్ను మాపి, ఎక్స్‌గ్రేషియ, పాడిరైతులకు సబ్సిడీ పశువులు, మస్థ్య కార్మికులకు ఉచితంగా చేపలు అందించడం, సబ్సిడీ వాహనాలు అందజేత కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పటికే అందజేసిందన్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలు వచ్చాయని, అకాల వర్షాలు వచ్చిన ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న వరదల పరిస్థితిపై ప్రతి నిమిషం సమీక్షిస్తు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుటికప్పుడు పరిస్థితిని అడిగి తెలసుకుంటూ ప్రాణ , ఆస్తి నష్టం జరుగ కుండా అన్ని చర్యలు చేపట్టలని రాష్ట్ర స్థాయి అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలనే క్రమంలో ప్రతి జిల్లాలో గ్రంథాలయాల నూతన భవనాల నిర్మాణం చేపట్టడం జరుతుందన్నారు.
మేధావులు గ్రంథాలయాల నుంచే తయారయ్యారన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడ ల అమరేందర్‌గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మల, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చిం తల కిష్టయ్య, గ్రంథాలయ కార్యదర్శి బాలమ్మ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు గోమారి సుదాకర్‌రెడ్డి, జనగాం పాండు, నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, గోళి పింగళ్‌రెడ్డి, రాచమల్ల రమేశ్, చెన్న మహేశ్, గాదె శ్రీనివాస్, శెట్టి బాలయ్య, నక్కల చిరంజీవి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, బుడమ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.