హైదరాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ): కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ పరిధిలో గతంలో మిగిలిన, తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ కమిషనర్ వీపీ గౌతం తెలిపారు. ఇండ్ల మధ్య ఉన్న ఈ ప్లాట్లను పారదర్శకంగా వేలం వేస్తామని పేర్కొన్నారు.
వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎల్ఐజీ, ఎంఐజీ గృహాల నిర్మాణానికి వినియోగించనున్నట్టు తెలిపారు. బోర్డుకు చెందిన 700ఎకరాల భూముల చుట్టూ ప్రహరీ నిర్మించామని, బోర్డు భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.