హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఫోర్ ట్వంటీ (420) అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికోట్ల జరిమానా వేసినా తప్పులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్ధాలు చెప్పిన ఎంపీకి 14 వేల డాలర్ల జరిమానా విధించిన ఘటనపై బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
‘మరి కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతు రుణమాఫీ, రైతుబంధు, రూ.4,000 పింఛన్లు, మహిళలకు రూ.2500 అని.. ఇట్ల 420 అబద్ధాలు చెప్పిన ముసలి నక కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి రూ.4.20 లక్షల కోట్ల జరిమానా వేసినా తప్పులేదు’ అని ఫైరయ్యారు. ఒక్కో అబద్ధానికి 7 వేల డాలర్ల జరిమానా విధించిన సింగపూర్ కోర్టు తీర్పు వార్త, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల పుస్తకాన్ని ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు.