హైదరాబాద్ జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఛాతినొప్పితో స్పృహ కోల్పోయి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం అండగా నిలుస్తున్నది. మాగంటి అస్వస్థత విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ సతీమణి శైలిమ హుటాహుటిన గురువారం సాయంత్రమే దవాఖానకు చేరుకున్నారు. గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ భరోసానిస్తున్నారు. గోపీనాథ్ ఆరోగ్యపరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్న కేటీఆర్కు ఫోన్ద్వారా తెలియజేస్తున్నారు