ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి.. కేటీఆర్
తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు.
- సీతారాముల కల్యాణోత్సవాలకు హాజరు
- రామన్నకు అడుగడుగునా ఘన స్వాగతం
రాజన్న సిరిసిల్ల, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, బొప్పాపూర్ శివారులోని మూడుగుళ్ల ఆలయం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల హనుమాన్, సీతారామచంద్రస్వామి, వెంకంపేట హనుమాన్ ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆయాచోట్ల నిర్వాహకులు, ఆలయ కమిటీ, భక్త మండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
రాముడి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతర పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆయాచోట్ల నాయకులు, యువకులు, చిన్నారులు సెల్ఫీల కోసం ఎగబడగా, కేటీఆర్ సైతం ఓపికతో సెల్ఫీలు, ఫొటోలుదిగి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన వెంట బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

