హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించేనున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను సన్మానించనున్నారు. కాగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార పార్టీకి ధీటుగా స్థానాలు గెలుచుకొని సవాల్ విసిరింది. దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలను కూడా పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.
ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇతర పార్టీ నాయకులు భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎం బీసీ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.