Minister KTR | హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మెన్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మంత్రి కేటీఆర్‌తో ఉన్న స్నేహాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నా. యునైటెడ్ స్టేట్స్, తెలంగాణకు మధ్య పెరుగుతున్న సంబంధాలకు ఈ అద్భుతమైన భాగస్వామ్యయే ఉదాహరణ’ అని ట్వీట్ చేశారు. జోయెల్ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణకు మీరు అందించిన అద్భుతమైన మద్దతు.. మీ స్నేహానికి ధన్యవాదాలు జోయెల్. మీ కొత్త అసైన్‌మెంట్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
Many thanks Joel for your friendship and terrific support to Telangana
I wish you the very best as you move on to your new assignment 👍 https://t.co/XvNXmYPew4
— KTR (@KTRTRS) June 14, 2022