హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు.. లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమంలో యావత్తు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సంక్షేమ సంబురాల దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు.
సమైక్యరాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమం ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం తెలంగాణ తొమ్మిదేళ్ల సంక్షేమ పథం యావత్ దేశానికే సరికొత్త సందేశం ఇవాళ తెలంగాణలో… సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు లబ్ధిదారుడు లేని కుటుంబం లేదు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ నలుమూలలా సంక్షేమ సంబురాలు కేంద్ర ప్రభుత్వ మోడల్ పేదలను ముంచడం..పెద్దలకు పంచడం ఒక మాటలో చెప్పాలంటే… సంక్షేమం.. భారం కాదు.. మా ప్రభుత్వ బాధ్యత అని అక్షరాలా ఆచరించిన ఏకైక సీఎం కేసీఅర్గారు ప్రతి పథకంలో మానవీయ కోణం అందుకే నేడు సంక్షేమంలో స్వర్ణయుగం పేదల కొనుగోలు శక్తిని పెంచిన ప్రభుత్వమిది ఆత్మగౌరవంతో బతికే అవకాశమిచ్చిన అపూర్వ సందర్భమిది సబ్బండ వర్గాల సంక్షేమం సకల జనుల జీవన భద్రత మన సీఎం కేసీఆర్ గారితోనే సాధ్యం తొమ్మిదేళ్ల ప్రస్థానమే.. దీనికి నిలువెత్తు సాక్ష్యం ఒక సంక్షేమ రంగానికే… ఏటా 50 వేల కోట్లకుపైగా నిధులు చరిత్రలో ఏ పాలకుడు చేయని సాహసమిది ఆలోచనకు కూడా అందని భారీ మొత్తమిదిదేశ సంక్షేమరంగం చరిత్రలోనే సరికొత్త అధ్యాయమిది.