హైదరాబాద్, జూన్ 19 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్ల్లండ్లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహించనున్న ఫ్రాంటియర్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పదేండ్లలో తెలంగాణ అభివృద్ధికి సాంకేతికతను వినియోగించిన తీరు.. పెట్టుబడి ఆకర్షణలకు తీసుకున్న చర్యలు, అమలుచేసిన పారిశ్రామిక విధానాలు అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు.