హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మే 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించనున్న ప్రపంచ వ్యాణిజ్య సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు పరిశ్రమలశాఖ మంతి కే తారకరామారావు హాజరవుతారని సమాచారం. ఈ సదస్సులో పాల్గొనేందుకు మన దేశానికి చెందిన సు మారు 100 మంది సీఈవోలు, వందల సంఖ్యలో వాణిజ్య, రాజకీయ నేతలు ఇప్పటికే తమ పేర్లను నమోదుచేసుకొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశా లు, రాష్ర్టాలకు చెందిన అధిపతులు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, విదేశీ వ్యవహారాలు, వాణి జ్య, ఆర్థిక, ఇంధన తదితర శాఖల మంత్రులు, జీ-7, జీ-20 దేశాల ప్రతినిధులు కలిపి మొత్తంగా రెండు వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉన్న ది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలకు చెందిన వాణిజ్య అధిపతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ప్రపంచస్థాయి వాణి జ్య, రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై, పరస్పరం చర్చించుకొనేందుకు ఇది సరైన అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
వివిధ అంశాలపై 400 సెష న్స్ నిర్వహించనున్నారు. మన దేశం నుంచి సద స్సు కోసం పేర్లు నమోదు చేసుకున్న వాణిజ్య ప్ర ముఖులు, సీఈవోల్లో అదానీ గ్రూప్ అధినేత గౌ తం అదానీ, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అం బానీ, ఆయన ఇద్దరు పిల్లలు ఈషా, ఆకాశ్, బజా జ్ ఫిన్సర్వ్కు చెందిన సంజీవ్ బజాజ్, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కుమారమంగళం బిర్లా, టాటాసన్స్కు చెందిన ఎన్ చంద్రశేఖరన్, యాక్సిస్ బ్యాంకుకు చెందిన అమితాబ్ చౌదరీ, హెచ్‌సీఎల్ టెక్కు చెందిన రోష్నీ నాడార్ మల్హోత్రా, ఇన్ఫోసిస్ కు చెందిన సలైల్ పరేఖ్, సీరం ఇన్స్టిట్యూట్కు చెం దిన అదర్ పూనావాలా, పేటీఎంకు చెందిన విజయ్‌శేఖర్ శర్మ, రీన్యూ పవర్‌కు చెందిన సుమంత్ సిన్హా, టాటాస్టీల్‌కు చెందిన టీవీ నరేంద్రన్, విప్రో కు చెందిన రిషద్ ప్రేమ్‌జీ తదితరులు ఉన్నారు. సదస్సు సందర్భంగా ‘స్ట్రాటజిక్ ఔట్లుక్ ఆన్ ఇండి యా’, ‘ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్’ అనే అంశాలపై అధికారిక సెషన్లు నిర్వహించనున్నారు.