హైదరాబాద్,సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేరళం రాష్ట్రంలోని కొచ్చిలో బుధవారం జరుగనున్న ‘ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ -2026’లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు.‘తెలంగాణ స్టేట్-ఫార్మేషన్ టు ట్రాన్స్ఫార్మేషన్’అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ కాంక్లేవ్‌లో రాజకీయ, విధానపరమైన, సాంసృతిక అంశాలపై చర్చించనున్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రాధాన్యతలు, ఆకాంక్షలు దేశ తదుపరి దశను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనే అంశాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.