హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక గ్రీన్ లీడర్షిప్ అవార్డు-2025కు తాను ఎంపిక కావడం చాలా గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, తెలంగాణలో ముఖ్యమైన రాజకీయ, ఎన్నికల సంబంధిత సమావేశాల కారణంగా ఈనెల 24న న్యూయార్లో ని ర్వహించే అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతోపాటు జరిగే 9వ ఎన్వైసీ గ్రీన్ సూల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డుకు ఎంపిక కావడం తనకు చాలా గర్వకారణంగా ఉన్నట్టు తెలిపారు. ‘ఈ గుర్తింపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చదనం పెంపునకు చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలకు అంకితం’ అని పేర్కొన్నారు.
పార్టీ కార్యకలాపాల కారణంగా ఈ అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తంచేశారు. హరిత, వాతావరణ అనుకూల తెలంగాణను నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమష్టి కృషికి ఈ పురసారం నిదర్శనమని వివరించారు. ఈ అవార్డును అందించిన గ్రీన్ మెంటర్స్ సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సస్టయినబిలిటీ రంగంలో నాయకులను ప్రోత్సహించాలన్న వారి లక్ష్యాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానని, భవిష్యత్తులో ఈ సంస్థతో, ఇతర అంతర్జాతీయ వాతావరణ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని ఆయన వెల్లడించారు.
ఏకైక పొలిటికల్ లీడర్ కేటీఆర్
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగే ైక్లెమెట్ వీక్ ఎన్వైసీలో భాగంగా 9వ ఎన్వైసీ గ్రీన్ సూల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డును అందజేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలో కేటీఆర్ చూపిన దార్శనిక నాయకత్వానికి ఈ అవార్డు గుర్తింపుగా లభించింది. ఈ సంవత్సరం ఈ పురసారానికి ఎంపికైన ఏకైక రాజకీయ నాయకుడు కేటీఆర్ మాత్రమే. ఈ అవార్డును న్యూయార్ మేయర్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి సమక్షంలో అందజేస్తారు. కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి అధికారులు, అంతర్జాతీయ విధాన రూపకర్తలు, పర్యావరణ నిపుణులు ప్రముఖులు పాల్గొంటారు.
తెలంగాణలో కేటీఆర్ పర్యావరణ కృషి
తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా తన పదవీకాలంలో కేటీఆర్ దేశంలోనే అత్యంత ముఖ్యమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. హరితహారంలో భాగంగా 10 కోట్ల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరవ్యాప్తంగా 977 పారులు అభివృద్ధి చేశారు. 108 లంగ్స్ పారులు, థీమ్ పారులు, రెయిన్ గార్డెన్లు, ల్యాండ్ సేప్ గార్డెన్లు, వర్టికల్ గార్డెన్లు నెలకొల్పారు. వీటితో తెలంగాణ పచ్చదనం గణనీయంగా పెరిగింది. ఈ కృషి ఫలితంగా హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు లభించింది. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తింపు పొం దిన ఏకైక భారతీయ నగరంగా నిలిచింది. ఈ గుర్తింపును ఆర్బర్ డే ఫౌండేషన్, ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అందించాయి.
అవార్డు అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు
ఈ అవార్డును గ్రీన్ మెంటర్స్ అనే విద్యాసంస్థ అందిస్తున్నది. ఈ సంస్థకు ఐక్యరాజ్యసమితి ఎకోసాక్ ప్రత్యేక సలహాదారు హోదా ఉన్నది. అలాగే యు నెసో గ్రీనింగ్ ఎడ్యుకేషన్ పార్ట్‌నర్‌షిప్‌కు ఇది అధికారిక భాగస్వామి. ప్రతి సంవత్సరం ైక్లెమేట్ వీక్ ఎన్వైసీ సందర్భంగా ఈ సంస్థ గ్రీన్ సూల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. నిరుడు ఈ అవార్డును డాక్టర్ జేన్ గూడాల్ (ఐక్యరాజ్యసమితి శాంతిదూత), డాక్టర్ వందన శివ, రాబర్ట్ స్వాన్, డాక్టర్ సిల్వియా ఎర్లే, బెల్జియం యువరాణి ఎస్మెరాల్డా, పాల్ పోల్మన్ (యూనిలీవర్ మాజీ సీఈవో), లిసా జాక్సన్ (ఆపిల్ ఉపాధ్యక్షురాలు) వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు అందుకున్నారు. గ్రీన్ మెంటర్స్ వేదికలపై గతంలో బాన్‌కి-మూన్, అల్గోర్, రిచర్డ్ బ్రాన్స న్, జెసిండా ఆర్డెర్న్, క్రిస్టియానా ఫి గ్యూర్స్ తదితరులు ప్రసంగించారు.