KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కేరళలోని కోయంబత్తూరులో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మక ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్టాత్మకమైన 10వ ఎఫ్ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన రేపు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్స్టిట్యూషన్స్లో జరగనుంది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీల్లో కేటీఆర్ పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నారు. యువతలో ఆవిష్కరణ దృక్పథం, టెక్నాలజీ ప్రోత్సాహం, మోటార్‌స్పోర్ట్స్ రంగంలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా కార్యక్రమం నిలువనున్నది.