హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం చెన్నైలో శివ్‌నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఇగ్నిషన్’ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. జర్నలిస్ట్ శోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు పాల్గొననున్నారు.
‘రీబూటింగ్ ది పబ్లిక్’ అనే సెషన్లో దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, దేశంలో ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. టెక్ కారిడార్ల పెరుగుదలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను కేటీఆర్ వివరించనున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశమున్నది.