హైదరాబాద్, అక్టోబరు 15 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ప్రతినిధుల సభను ఈనెల 17న తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా కోఆర్డినేటర్స్, ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు.