హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తీహార్ జైలు నుంచి బెయిల్‌పై మంగళవారం బయటికి వచ్చిన తరువాత ఆమె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి నేరుగా ఢిల్లీ వసంతవిహార్లోని తెలంగాణభవన్‌కు బయలుదేరారు. తెలంగాణభవన్‌లో ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్‌జాదవ్, బీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, కర్నె ప్రభాకర్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, కే వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, వై సతీశ్‌రెడ్డి తదతరులతో కవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి స్వచ్ఛందంగా వచ్చి కుటుంబానికి, పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మధ్నాహ్నం హైదరాబాద్ రానున్నట్టు వెల్లడించారు. సమావేశ మందిరంలోకి వచ్చిన తరువాత ఆమెకు కేటీఆర్ మిఠాయి తినిపించి స్వాగతం పలికారు.