KTR Tea Stall | మొన్న కేసీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా కేటీఆర్ ఫొటో ఉందని ఏకంగా ఒక టీస్టాల్నే మూసివేయించింది. సిరిసిల్లలో ఓ టీ స్టాల్‌కు దాని యజమాని కేటీఆర్ పేరు పెట్టుకోవడంతో పాటు హోటల్లో ఆయన ఫొటో పెట్టుకున్నారని కక్షగట్టి మరీ సీజ్ చేయించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ బతుకమ్మ ఘాట్ వద్ద గత నాలుగేళ్లుగా ‘కేటీఆర్ టీ స్టాల్’ నడిపిస్తున్నాడు. హోటల్ బోర్డుపై కూడా కేటీఆర్ ఫొటో పెట్టుకున్నారు. ఇది గమనించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆ హోటల్‌ను మూసేయించారు. అసలు ఆ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేకుంటే హోటల్‌ను సీజ్ చేయండి అంటూ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హుకుంతో వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది టీ స్టాల్‌ను బలవంతంగా మూసివేయించారు.
A poor tea seller in #Sircilla is being harassed just because he has #KTR’s photo on his stall 🚨
A man struggling to earn his daily bread is now being targeted. Collector garu seems less like an officer, more like a Congress worker. Maybe this is what Revanth Reddy meant when… pic.twitter.com/6KgJ9pckY1
— Nayini Anurag Reddy (@NAR_Handle) February 19, 2025
తన టీ స్టాల్‌ను సీజ్ చేయడంపై బత్తుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతోనే టీ స్టాల్ మూసివేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారని.. కానీ అసలు కారణం అది కాదని తెలిపాడు. కేటీఆర్ ఫొటో తీసేయాలన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా కక్ష కట్టాడని చెబుతున్నాడు. టీ స్టాల్ పోయినా సరే.. నా అన్న కేటీఆర్ ఫొటో తీయనని స్పష్టం చేయడంతోనే ఇలా హోటల్ సీజ్ చేశారని ఆరోపించాడు. కాగా, కేటీఆర్ ఫోటో ఉందని హోటల్ మూసేయడం ఏ న్యాయం? ప్రజాస్వామ్యమా, లేక కాంగ్రెస్ తుగ్లక్ పాలనా?” అంటూ స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.