హనుమకొండ, జనవరి 25 : వరంగ ల్కు బీఆర్ఎస్ 29వ డివిజన్ అధ్యక్షుడు, దళిత సామాజికవర్గానికి చెందిన కొడకండ్ల సదాంత్పై అధికార పక్షం కక్షపూరితంగా వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఆదివా రం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసం లో బాధితుడు సదాంత్, రాజ్యసభ సభ్యు డు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్, దోమ రమేశ్‌తో కలిసి కేటీఆర్‌ను కలిశారు. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం, మున్సిపల్ అధికారులు కలిసి తనను ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో కేటీఆర్‌కు వివరించారు.
వరంగల్ భద్రకాళీ ఆలయ సమీపంలోని ప్రైవేట్ స్థలంలో తాను నివాసముంటూ, వ్యాపారం కోసం నిర్మించుకున్న షెడ్డును ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లో యాక్టివ్ గా ఉంటున్నందున స్థానిక ఎమ్మెల్యే, మేయర్ ఒత్తిడితో అధికారులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. స్పందించిన కేటీఆర్ దళిత బిడ్డను లక్ష్యంగా చేసుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వేధింపులకు గురిచేయడం అన్యాయమని, ఈ విషయంలో బాధితుడి హకులను కాపాడానికి పోరాడుతామని తెలిపారు. పార్టీ కార్యకర్తగా సదాంత్కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అధికారుల తీరుపై చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు.