ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ధైర్యం కోల్పోకండి
‘ఇది మన దురదృష్టం. ఈ ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ధైర్యం కోల్పోకండి.. ఇలా పంటలకు నిప్పులు పెట్టుకోకండి..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన రైతు సిరిపురం తిరుపతితో ఫోన్లో మాట్లాడి భరోసా నింపారు. ఇటీవల సాగు నీరందక కడుపుమండి ఎండిన వరికి పెట్రోల్ పోసి నిప్పంటించిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, శ్రేణులతో కలిసి గురువారం వెళ్లారు.
- కడుపుమండి వరిపైరుకు నిప్పు పెట్టిన రైతు తిరుపతికి కేటీఆర్ భరోసా
- ఫోన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో మాట్లాడించిన రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు
దండేపల్లి, నవంబర్ 19 : ‘ఇది మన దురదృష్టం. ఈ ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ధైర్యం కోల్పోకండి.. ఇలా పంటలకు నిప్పులు పెట్టుకోకండి..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన రైతు సిరిపురం తిరుపతితో ఫోన్లో మాట్లాడి భరోసా నింపారు. ఇటీవల సాగు నీరందక కడుపుమండి ఎండిన వరికి పెట్రోల్ పోసి నిప్పంటించిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, శ్రేణులతో కలిసి గురువారం వెళ్లారు. రైతులు మల్లికార్జున్, సిరిపురం తిరుపతి, తొట్ల సత్తన్న, మామిడి రాజన్న పంటలను పరిశీలించి వారితో మాట్లాడారు. అధైర్యపడొద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్‌తో మాట్లాడించి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా విజిత్‌రావు మాట్లాడుతూ.. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో సాగు నీరందక అనేక ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. గూడెం లిఫ్ట్, కడెం ప్రాజెక్ట్ ద్వారా రైతాంగానికి నీరివ్వాల్సిన ప్రభుత్వం, నీటిని విడుదల చేయకుండా రైతులను గోసపెడుతున్నదని మండిపడ్డారు. గూడెం లిఫ్ట్ నుంచి మోటర్లు ఆన్ చేసి, కాళేశ్వరం నుంచి ఎల్లంపెల్లి ప్రాజెక్టు నింపితే నియోజకవర్గంలో పంటలు ఎండిపోయేవి కావని చెప్పారు. ఇప్పటికైనా చివరి తడి అందించి, రైతులు పూర్తిగా నష్టపోకుండా చూడాలని కోరారు.
రైతు తిరుపతితో కేటీఆర్ సంభాషణ ఇలా…
కేటీఆర్: ఏమి లేదన్నా… మీకు చెప్పేది ఏందంటే…
రైతు(తిరుపతి): చెప్పండి సార్
కేటీఆర్: ఇప్పుడు వీళ్లు నీళ్లు ఉండి ఇస్తలేరు
రైతు: అవును సార్
కేటీఆర్: ఎందుకంటే నీళ్లు ఇస్తే యూరియా ఇయ్యాలే, యూరియా ఇస్తే పంటలు పండుతయి. పంటలు పండితే కొనాలే, కొంటే బోనస్ ఇయ్యాలి. మద్దతు ధర ఇయ్యాలి. ఇదంతా ఎందుకు అని ఇస్తలేరు
రైతు: కరెంటు కూడా సక్కగా ఇస్తలేరు సార్
కేటీఆర్: మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే..ఇంకొక్క సంవత్సరం ఇట్లనే ఉంటది వీళ్లతోని
రైతు: అవును సార్
కేటీఆర్: ఇది మన దురదృష్టం.. మంచిర్యాలలో మీరు కాంగ్రెస్‌ను గెలిపించారు. గెలిపించినంక ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు.. కాబట్టి ఒక్క సంవత్సరం ఓపిక పట్టాలి. ధైర్యం కోల్పోకండి. ఇలా పంటలకు నిప్పులు పెట్టుకోకండి.
రైతు: నష్టం చాలా అయింది సార్. రెండు ఎకరాలు అంటే దాదాపు 70 వేల వరకు ఖర్చు అయింది మాకు. ప్రభుత్వం మాకు ఏమన్నా ఇస్తదా సార్
కేటీఆర్: డిమాండ్ చేస్తున్నాం. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు. అవికూడా కలిపి ఇయ్యమని అడుగుతున్నాం
రైతు: సార్..
కేటీఆర్: కాకపోతే ఆయన సంగతి మీకు తెలుసు కదా.. ఎట్లా ఉంటదో .. ఏదేమైనా ధైర్యం కోల్పోకండి, అధైర్య పడకండి
రైతు: సరే సార్..మొన్న విసుగుచెంది పంటకు మంట పెట్టుకున్నాం
కేటీఆర్: చూసినా…చూసినా.. కొద్దిగా ధైర్యంగా ఉండండి. ఈ ఒక్క సంవత్సరం ధైర్యం కోల్పోకండి. ఏమన్నా ఉంటే విజిత్‌రావు వస్తాడు, మన దివాకర్‌రావు సార్ వస్తాడు
రైతు: సరే సార్..
కేటీఆర్: రైట్..రైట్
విజిత్‌రావు: ఓకే అన్న…థాంక్యూ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

