Rythu Bharosa | 30 నెలల్లో రైతులకు..30,000కోట్ల ఎగవేత.. ఇదీ మీ ముదనష్టపు పాలన.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం!
Rythu Bharosa | ‘మీ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్‌రెడ్డి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
Rythu Bharosa | రైతుభరోసా పేరిట కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ నేతలు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రైతుల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ‘మీ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్‌రెడ్డి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రెండున్నరేండ్లలో ఎగ్గొట్టిందే ఎకువని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలు ఏమిటి? అని నిలదీశారు. కేవలం ఒక బటన్ నొకి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగసభ పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్ స్టంట్లు
చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరచిపోతారని అనుకోవడం అవివేకమేనని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ప్రతి ఎకరానికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీచేసి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముఖ్యమంత్రి ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ‘అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకొంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయం. ఇప్పటికే రూ.50 వేల కోట్లతో చేయాల్సిన 2 లక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశావు. 72సార్లు నీ ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్‌లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దకేది’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇది రైతుల అటెన్షన్ డైవర్షన్ డ్రామా
రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరుకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దికుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న రేవంత్‌రెడ్డి చేతకానితనాన్ని చూసి రైతులు రగిలిపోతున్నారని తెలిపారు. కేసీఆర్ ఠంచన్‌గా 11 సార్లు రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారని గుర్తుచేశారు. పదేండ్లు పండుగలా సాగిన వ్యవసాయాన్ని దండుగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిచి ఉంటే.. మీరు (కాంగ్రెస్ సర్కారు) ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

