హైదరాబాద్: రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపైకి చట్టవిరుద్ధంగా బుల్డోజర్ పంపుతున్న రేవంత్ సర్కార్ పెద్దలకు మాత్రం చుట్టంలా మారిందని ఫైర్ అయ్యారు. సామాన్యుల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ బడా బాబులకు మాత్రం నెలల తరబడి గడువులతో నోటీసులిస్తున్నారని మండిపడ్డారు. ఇదీ రేవంత్ రాక్షస పాలనలో ప్రజల గోస పుచ్చుకుంటున్న హైడ్రా తీరు అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఇండ్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే ప్రజాపాలనా అని నిలదీశారు. గరీబోంకొ హటావో అనేదే కాంగ్రెస్ సిద్ధాంతమా అని ప్రశ్నించారు.
‘పేదలపైకి చట్టవిరుద్ధంగా బుల్డోజర్
పెద్దలకు మాత్రం చుట్టంలా మారిన రేవంత్ సర్కార్!
సామాన్యుల ఇండ్లైతే నిరాక్షిణ్యంగా కూల్చివేతలు.
బడా బాబులకు మాత్రం నెలల తరబడి గడువులతో నోటీసులు.
ఇదీ.. రేవంత్ రాక్షస పాలనలో ప్రజల గోస పుచ్చుకుంటున్న హైడ్రా తీరు.
15 నెలల్లో 612 చోట్ల సామాన్యుల ఇండ్లు నేలమట్టం చేసిన కర్కశ రేవంత్ సర్కార్..
బడా బాబులు, అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల ఇండ్ల, గెస్ట్హౌజుల వైపు మాత్రం కన్నెత్తి చూడట్లేదు.
ఇండ్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా?
ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే ప్రజాపాలనా??
గరీబోంకొ హటావో అనేదే కాంగ్రెస్ సిద్ధాంతమా???’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.